శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫూర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు, సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు 25 కోట్ల 41 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే నాలాల విస్తరణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలను ముంచెత్తడం జరుగుతుందని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుందని, భవిష్యత్తులో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాలా విస్తరణ పనులు చేపడుతున్నాం అని అన్నారు. ఈ RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుందని, రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE ఆనంద్, AE జగదీష్, కాంట్రాక్టర్ PS రెడ్డి తదితరులు పాల్గొన్నారు.