నమస్తే శేరిలింగంపల్లి : చెరువుల సుందరీకరణ , చేపట్టవలసిన అభివృద్ధి పనుల పై వివేకానందనగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిపోయిన చెరువుల సుందరీకరణ పనులలో వేగం పెంచాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులలో అలసత్వం ప్రదర్శించరాదని తెలిపారు.
చెరువుల చుట్టుపక్కల కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మురుగు నీరు కలిసే చోట కాలనీల ఇన్ లెట్, ఔట్ లెట్ సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు. చెరువులలో డ్రైనేజీ కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డోయెన్స్ కాలనీ, సాయి వైభవ్ కాలనీ, అపర్ణ కౌంటీ వంటి కాలనీల డ్రైనేజీ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని, చెరువులో మురుగు నీరు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
మీది కుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రూ. 35 లక్షలు, రేగుల కుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రూ. 50 లక్షలు, మల్లయ్య కుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రూ. 10 లక్షలు, భక్షి కుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రూ. 10 లక్షల రూపాయల నిధులు అందజేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, డిఈఈ నళిని, ఏఈ నాగరాజు, ఏఈ పావని , చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, డోయెన్స్ కాలనీ, సాయి వైభవ్ , అపర్ణ కౌంటీ కాలనీ వాసులు పాల్గొన్నారు .