నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ ఎఫ్ సి ఐ ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బండి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భాద్రపద శుక్లపక్ష చతుర్థి తిథిన గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని, గణేష్ చతుర్థిన, ప్రజలు 11 రోజుల పాటు గణేశుడిని పూజిస్తారన్నారు.
ఏడాది పొడవునా ఈ రోజు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు తమ స్నేహితులకు, బంధువులకు, ప్రజలందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ శివ శంకర్ మరియు కాలనీవాసులు విజయకుమార్, రాకేష్ సింగ్, జి. బాబురావు, శశికాంత్, మహమ్మద్ సలీం, బండి రమేష్ తో పాటు తప్ప బాలరాజు ముదిరాజ్, కాకర్ల అరుణ, ఉమేష్, వెంకటేశ్వరరావు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.