- ఆరు గ్యారంటీల కరపత్రాన్ని ఆవిష్కరించిన రంగారెడ్డి డి.సి. సి ప్రెసిడెంట్ చల్లా నర్సింహరెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : ఆరు గ్యారంటీ పథకాలను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతీ గడప గడపకు తీసుకు వెళ్లాలని రంగారెడ్డి డి.సి.సి ప్రెసిడెంట్ చల్లా నర్సింహరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పిసిసి ప్రతినిధి సత్యం రావు ఆదేశాల మేరకు మియాపూర్ లో ఆరు గ్యారంటీల కరపత్రాన్ని రంగారెడ్డి డి.సి. సి ప్రెసిడెంట్ చల్లా నర్సింహరెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకి అభయహస్తం అని తెలిపారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కీ అపూర్వ స్పందన, ఆధరణ కనిపిస్తుందని, దీని కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అంకిత భావంతో కలసి కట్టుగా పని చేయాలని ఆశా భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్ ఇలియాస్ షరీఫ్, నడిమింటీ కృష్ణ, జమీర్, మహిపాల్ యాదవ్, భరత్ గాంధీ రెడ్డి, దుర్గం శ్రీహరి గౌడ్, హరి కిషన్, అప్రొజ్ ఖాన్, ఖాజా పాషా, కమర్ పాషా, తన్విర్ బేగం, లక్ష్మీ, సోమరాజు, పద్మినీ ప్రియదర్శిని, షఫీ, ఆసీఫ్ పటేల్, గురువయ్య, శాంత, భాగ్యమ్మ, ఇస్మాయిల్, ఎస్.కే ఖాజా పాషా, దుర్గేశ్ పాల్గొన్నారు.