కొనసాగుతున్న ఉచిత కంటి పరీక్షల శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి : సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ జన్మభూమి కాలనీ గ్రౌండ్ వద్ద కమలమ్మ బస్తి , శివమ్మ బస్తీ, దత్తాత్రేయ కాలనీ ,అంబేద్కర్ నగర్ కాలనీవాసుల సౌలభ్యం కోసం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్, ట్రస్ట్ సెక్రెటరీ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కట్టి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి తమవంతు బాధ్యతగా ట్రస్ట్ స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కాలనీవాసులు, బస్తీ వాసులు తమ సేవలు సద్వినియోగపరుచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో నరసింహచారి, వెంకటస్వామి రెడ్డి, నర్సింగ్ యాదవ్ కుమార్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, కృష్ణ గౌడ్, సందీప్ గౌడ్, ఎత్తరి రమేష్, రవీందర్ రెడ్డి, సాయిరాం, సుంకయ్య, రాయల్, కిరణమ్మ, సైదమ్మ , అనూష పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here