నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. దేవాలయ కార్యవర్గ సభ్యులు సేవాసమితి సభ్యులు , అశేష భక్తులు పాల్గొని కళ్యాణమహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. తదనంతరం ఆలయ ప్రధానాచార్యులు స్వామి వారి హారతి తీర్థ ప్రసాదాలు అందజేయగా.. వాటిని స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.