నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ వ్యాలీ కాలనీ వద్ద నూతనంగా చేపట్టిన మంజీర పైప్ లైన్ పనులను స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇప్పటికే పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మంజీర పైప్ లైన్ చోటా నూతనంగా చేపట్టాల్సిన సీసీ రోడ్డు అభివృద్ధి పనులపై నాయకులతో కలిసి సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఏ.కె బాలరాజు, కాలనీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు సత్తి రెడ్డి, కృష్ణ రావు, ఫణి రాజ్, అశోక్, రవీందర్, అరవింద్, భార్గవ గౌడ్, షఫీ, వరుణ్ పాల్గొన్నారు.