నమస్తే శేరిలింగంపల్లి: వర్టెక్స్ ఏజెన్సీ చేపట్టిన తవ్వకాల్లో జరిగిన ప్రమాదంలో… అపార్ట్మెంట్ వదిలి వెళ్లిన వారికి అండగా ఉంటామని శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు.
వర్టెక్స్ ఏజెన్సీ గత రెండు సంవత్సరాలుగా పక్కన అపార్ట్ మెంట్ వాసులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నా… ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం తలెత్తిందన్నారు. దాదాపుగా 100 అడుగుల లోతు సెల్లార్ తవ్వడమే కాకా, అందులో బండరాళ్లు రావటం వల్ల ఎలాంటి అనుమతి లేకుండా బాంబ్ బ్లాస్ట్ చేయడం, పక్కనున్న రెండు అపార్ట్మెంట్స్ అదరడం జరిగిందని స్థానికులు చెప్పారని తెలిపారు. ఒక దశలో బిల్డింగ్స్ కూలిపోయే ప్రమాదానికి చేరుకోగా.. ప్రాణాపాయస్థితికి చేరుకున్న తర్వాత అధికారుల మత్తు వదిలి పోలీసులను తీసుకొచ్చి ఆ రాత్రి బలవంతంగా వారిని ఖాళీ చేయించారని పేర్కొన్నారు.
కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకొని కట్టుకున్న ఇంటిలో వారు నివసించే పరిస్థితి లేని, దుర్భర పరిస్థితి శేరిలింగంపలిలో తయారయిందని చెప్పడానికే ఒక పౌరుడిగా సిగ్గుతో తలవంచుకుంటున్న వారికి పూర్తి న్యాయం జరిగే వరకూ.. వారికి అండగా ఉంటామని తెలిపారు.