- పలహార బండి ఊరేగింపులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: అతి భారీ వర్షపాతం నుండి నియోజకవర్గ ప్రజలను కాపాడి అందరూ సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అమ్మవారిని వేడుకున్నారు.
లింగంపల్లి డివిజన్ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో స్థానిక యువకులు తీసిన పలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయనతో పాటు కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్ , భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, శ్రీకాంత్, అనుదీప్, రోను యాదవ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.