నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కెసిఆర్ ముద్దుల తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని వేడుకగా జరుపుకున్నారు. బిఆర్ ఎస్ నేత మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో నివసించే సంకటి స్వామి ఇంటి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కేకు తెచ్చి మంత్రి పుట్టినరోజును వేడుకగా జరిపించారు.
ఉద్యమకారుడు సంకటి స్వామి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినన్ని ఘనంగా చేసామని మిద్దెల మల్లారెడ్డి చెప్పారు. రానెమ్మ లత మొగులమ్మ హనీఫ్ ఆఫ్టబ్ అయాజ్ రాజు పాల్గొన్నారు.