భావి తరాల తెలంగాణకు నిలువెత్తు ఆశాకిరణం కేటీఆర్ : ప్రభుత్వ విప్ గాంధీ 

  • కేటిఆర్ నాయకత్వం వెలుగులనిచ్చే దీపం.. సంక్షేమ పాలన పేద ప్రజలకు లాలన..: కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్
  • కేటిఆర్ జన్మదినం సందర్బంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్ ‘

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర డైనమిక్ లీడర్, యువతకు స్ఫూర్తిదాయకులు మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో సర్వమత ప్రార్ధనలు నిర్వహించి కేటీఆర్ ని ఆశీర్వదించారు, అనంతరం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కార్పొరేటర్లు, వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ , నార్నే శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్ కేక్ కట్ చేసి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు.

మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ నివాసి దివ్యాంగుడు అస్లాం ఖాన్ కి ద్విచక్ర వాహనం అందించారు, ఆదిత్య నగర్ ఉర్దూ మీడియం పాఠశాల నందు సుమారు 400మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు మాట్లాడుతూ.. ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది, తెగించే దమ్ము ఉంది, పదిమందికి సాయం చేసే గుణం ఉంది, ఆపదలో ఆదుకునే మనస్తత్వం ఉంది, తమరి నాయకత్వం అద్వితీయం, పాలనా దక్షత అమోఘం, అన్న అంటే భరోసా ఇస్తూ అండగా ఉంటూ తోడుగా నిలిచే మహారాజు మన యువ నాయకుడు రామన్న అని అన్నారు.

మంత్రి ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్పూర్తితో హాఫీజ్ పెట్/మాదాపూర్ పరిధిలోని సుమారు 10 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2000వేల విద్యార్థులకు 8000వేల పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here