తెలంగాణ యువతరానికి ఆదర్శం..తండ్రికి తగ్గ తనయుడు మంత్రి కేటిఆర్: ప్రభుత్వ విప్ గాంధీ

  • మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు
  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ యువతరానికి ఆదర్శం, సకల గుణాభిరాముడు, తండ్రికి తగ్గ తనయుడు, జనహృదయ నేత, ప్రజలు మెచ్చిన నాయకుడు, గౌరవ ఐటి, పరిశ్రమల, పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి రక్తదానం శిబిరంను ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. అనంతరం మాట్లాడుతూ బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినంను పురస్కరించుకుని ఈ రోజు మహా రక్త దానం శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తప్పనిసరిగా రక్తదానం చేయాలన్నారు.

అనంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్ల జీవించాలని, మరింత ప్రజా సేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here