నమస్తే శేరిలింగంపల్లి: వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం, లింగంపల్లి 106 డివిజన్ పరిధిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని , ఇక్కడ ఏమాత్రం కూడా పట్టించుకునే అధికారులు లేరని, ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కనిపించట్లేదన్నారు. శేరిలింగంపల్లి అండర్ పాస్, చిన్నపాటి వర్షానికి రోడ్డు దాటడానికి వీలు లేకుండా ట్రాఫిక్ జామ్ ఉంటుందని, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లాలంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, ప్రజలకు, స్కూలు పిల్లలకు, చిరు ఉద్యోగులకు రోడ్డు దాటలేని పరిస్థితుల్లో పనులకు వెళ్లలేక ఇల్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.