నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని పిఏ నగర్ వికర్ సెక్షన్ కాలనీ, వేమన కాలనీలలో రూ.1 కోటి 15 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. పిఎ నగర్ వికర్ సెక్షన్ కాలనీలో రూ.97 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు , వేమన కాలనీ లో రూ.18.50 లక్షల అంచనా వ్యయంతో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం చేశామని తెలిపారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు , పెద్దలు , వృద్ధులను జిమ్ l ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అదేవిధంగా విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయభిలాషులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ సభ్యులు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.