క్యాన్సర్ పై ముందస్తుగా అవగాహన కలిగి ఉండాలి: మాదాపూర్ డిసిపి శిల్ప వల్లి

  • అమెరికన్ అంకాలజీ ఇనిస్టి ట్యూట్ ఆధ్వర్యంలో 4కే వాక్ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తుగా గుర్తించి వైద్యం అందిస్తే రోగం నయమవుతుందని మాదాపూర్ డిసిపి శిల్ప వల్లి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నల్లగండ్ల లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టి ట్యూట్ ఆసుపత్రి, సిటిజెన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే వాక్ ను ప్రారంభించి పాల్గొన్నారు.

కేన్సర్ అవగాహన వాక్ కు ముఖ్య అతిధి గా విచ్చేసిన డీసీపీ శిల్ప వల్లి కి స్వాగతం పలుకుతున్న సిటిజెన్ హాస్పిటల్ ఫెసిలిటీ డైరక్టర్ ప్రవీణ కుమార్

ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మరోధైర్యాన్ని అందించాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని , వైద్య విధానంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ఎటువంటి రోగాలనైనా పసిగట్ట గల సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. క్యాన్సర్ వ్యాధిపై వివిధ మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారాలను అర్థం చేసుకొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్పొరేట్ ఆసుపత్రుల పై ఉందన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగిన నాడే రోగాన్ని నయం చేయగలమని సూచించారు.

అనంతరం ఆసుపత్రి ఆర్ సిఓఓ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆసుపత్రి నిరంతరం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నల్లగండ్ల నుండి బీహెచ్ఈఎల్ చెక్ పోస్ట్ వరకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలతో కలిసి .. ప్ల కార్డులను చేతబట్టి క్యాన్సర్ పై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిటిజెన్ ఆసుపత్రి ఫెసిలిటీ డైరెక్టలు ప్రవీణ్ కుమార్, అంకిత పలు విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

రాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here