- నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన
- మియాపూర్ SI యాదగిరికి, జిహెచ్ఎంసి కి మియాపూర్, మాతృశ్రీ నగర్ వాసుల వినతి
నమస్తే శేరిలింగంపల్లి: స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మియాపూర్, మాతృశ్రీ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 150 ఎకరాల విస్తీర్ణం గల కాలనీలో నాలుగు రోడ్ల కూడమీలు, 20 వేల జనాభా, 15 నుంచి 20 వరకు స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి. కానీ నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్స్ లేక వాహనాల వేగానికి ప్రజలు, విద్యార్థులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, ఏ ఒక్క కూడలిలో కూడా ఇవి లేవన్నారు. ఇటీవల కాలనీలో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఇరువురు వ్యక్తులు దుర్మరణం చెందారని, పలువురు గాయాల పాలయ్యారని తెలిపారు. కాలనీ రోడ్స్ మీద నడవాలన్న, విద్యార్థులు సైకిల్ మీద పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలన్న భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విషయాన్నీ మియాపూర్ SI యాదగిరి, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్, GHMC వారి దృష్టికి తీసుకెల్లారు.
కాలనిలో తక్షణమే స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు CH రామయ్య , రవీంద్ర రెడ్డి, కోటేశ్వరరావు, అట్లూరి సతీష్, వెంకట రెడ్డి, శ్రీధర్, కాజా శ్రీనివాసరావు, ఇతర కాలనీ వాసులు అభ్యర్ధించారు.