నమస్తే శేరిలింగంపల్లి: ఆప్కో చైర్మన్ గా నియమితులైన గంజి చిరంజీవికి గంజి పరివార్ సేవా ట్రస్ట్ (హైదరాబాద్) అధ్యక్షుడు గంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఉదయం 11:45 నిముషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని గంజి చిరంజీవిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎం ఎల్ సి మురుగుడు హనుమంతరావు, ఎం ఎల్ సి పోతుల సునీత, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మెన్ జింక విజయలక్ష్మి, కమిటీ ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు, కోశాధికారి గంజి వెంకటేష్, కార్యదర్శి గంజి మరుతి సభ్యులు గంజి రమేష్, గంజి నాగరాజ్ రావు పాల్గొన్నారు.