నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి ప్రాంతంలో పాతిక సంవత్సరాల నుంచి రోడ్డుపై బతుకుతున్న చిరువ్యాపారులకు న్యాయం చేయాలని బిజెపి నేత, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి బుధవారం జాయింట్ కమీషనర్, ట్రాఫిక్ నారాయణ్ నాయక్ ను కోరారు. బాధితులతో కలిసి ఆయన జాయింట్ కమీషనర్, సైబరాబాద్ కు వినతి పత్రం సమర్పించి, మానవతాదృష్టితో చూడాలని కోరారు. ఇందుకు జాయింట్ కమీషనర్, ట్రాఫిక్ సానుకూలంగా స్పందించారు.