డివిజన్ అభివృద్ధికి కృషి : కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ ప్రొఫెసర్ కాలనీలో నూతనంగా మంజూరైనా 1.8 km మేర మంజీరా మంచి నీటి పైపులైన్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విచ్చేసి, జలమండలి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తూ, అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజలు కోరుకొనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి, మౌలిక వసతులు లేమి లేకుండా, ఇంటిఇంటికి నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చటం వంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో, వారి సూచనలతో అభివృద్ధి కార్యక్రమలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీతో కార్పొరేటర్ హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, అశోక్ గౌడ్, తెరాస పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ జె. బలరాం యాదవ్, వాటర్ బోర్డు అధికారులు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ సందీప్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, ఊట్ల దశరద్, బాల్ రెడ్డి, కె. నిర్మల, రక్తపు జంగంగౌడ్, శ్రీరామ్ నగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, ఎర్రరాజు, తిరుపతి యాదవ్, బుడుగు తిరుపతి రెడ్డి, కచ్చావా దీపక్, సంజీవ పాల్గొన్నారు.