అక్టోబర్ 15న ఆందోళన

  • 17న ఓంకార్ వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయండి
  • BLF చైర్మన్  సూర్యప్రకాష్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: అక్టోబర్ 15న ఆందోళన, 17న ఓంకార్ వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని బిఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు. బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్, బి.యన్ హాల్లో 11న మధ్యాహ్నం జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో సూర్యప్రకాష్ మాట్లాడారు. సెప్టెంబర్ 29, 30 తేదీలలో నిజామాబాద్ లో జరిగిన బిఎల్ఎఫ్ రాష్ట్ర స్థాయి తరగతుల సందర్భంగా జరిగిన రాష్ట్ర కమిటీలు తీసుకున్న నిర్ణయం మేరకు..అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్, బిసి, ఎంబిసి, ఎస్టీ, మైనారిటీ కార్పోరేషన్లకు నిధులు, అనర్హులకు దళిత బంధు ఇచ్చిన అధికారులపై చర్యలు, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల సబ్సిడీ రుణం, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసున్న వారికి పట్టాలు, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పేద, మధ్యతరగతి ప్రజల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో మౌలిక వసతులు, సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించి అందులో వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ తో అక్టోబర్ 15న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. బీ.సీ కులగణన జరపాలని – చట్టసభలలో రిజర్వేషన్స్ అమలు చేయాలనే డిమాండ్ తో అక్టోబర్ 17 నుంచి 31 వరకు చేపట్టే కార్యక్రమాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాలు పాల్గొనాలని MCPI(U) వ్యవస్థాపక నేత, మాజీ శాసనసభ్యులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 14వ వర్ధంతి కార్యక్రమంలో నిర్ణయించినట్లు తెలిపారు. జనాభాలో 54% శాతంగా ఉన్న బీసీ సామాజిక వర్గ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధించుకునే వరకు అందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు శాసనసభ ఉప ఎన్నికకు అక్టోబర్ 17 తర్వాత బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) విధానాన్ని ప్రకటించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసినట్లు స్పష్టం చేశారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, రాష్ట్ర నాయకులు వల్లెపు పేందర్రెడ్డి, యస్.సిద్ధిరాములు, వస్కుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న పాల్గొన్నారు.

బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్, బి.యన్ హాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న BLF చైర్మన్  నల్లా సూర్యప్రకాష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here