నమస్తే శేరిలింగంపల్లి : “మిలాద్-ఉన్- నబీ”ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ తార నగర్ కి చెందిన తెరాస సీనియర్ నాయకుడు అబీబ్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అబీబ్ కి, ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ “మిలాద్-ఉన్- నబీ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని సూచించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అబీబ్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.