ఆల్విన్ కాలనీ డివిజన్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ కూడలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పోరేటర్ వెంకటేష్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఓటరు నమోదు కోసం ఫామ్ 18 పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్, సీనియర్ నాయకులు నరసింహాచారి, నాయకులు మున్నాభాయ్, యాదగిరి, రాములు గౌడ్, నాగేశ్వరరావు, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.