వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వవేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ మల్లికార్జున వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటేశ్వర నగర్ రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 6 లో సీసీ రోడ్లు పూర్తయిన నేపథ్యంలో గాంధీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించేలా చూస్తామని అన్నారు. కాలనీ లో ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని, ప్రజలకు ఎల్లా వేళల అందుబాటులో ఉంటానని అన్నారు. కాలనీల అభివృద్ధికి, డివిజన్ నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ్ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, మల్లికార్జున వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.