మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వార్డు మెంబర్ బండారు మహెందర్ ముదిరాజ్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సోమవారం బయోడాటాను అందజేశారు. డివిజన్‌లోని అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్ధతు తనకు ఉన్నదని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మియాపూర్ నుంచి అవకాశం కల్పిస్తే ఘన విజయం సాధిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మియపూర్ గ్రామ పెద్దలు ఓంప్రకాశ్ గౌడ్, రాంచందర్ ముదిరాజ్ వెంకటేష్ గౌడ్, అశోక్ ముదిరాజ్ కృష్ణ గౌడ్, అన్వర్ షరీఫ్ , మోహన్ ముదిరాజ్ ,గోపాల్ ముదిరాజ్, ముజీబ్, ఖాజా, హనీఫ్, ప్రసాద్, హనుమంతు, గురువయ్య, రాజు, రోషన్, కళ్యాణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.