కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ లో జీహెచ్ఎంసీ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్ పర్యటించారు. ధరణీ సర్వే తీరును పరిశీలించిన లోకేష్ కుమార్ స్వయంగా పలువురు నివాసితుల వివరాలను ధరణీ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి సర్వే విషయంలో అపోహలు వద్దని, సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు. ధరణి సర్వే నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది. ప్రధానంగా ఏ అంశాలపై ప్రజల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయనే విషయాన్ని ఆరాతీశారు. లోకేష్ కుమార్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉపకమిషనర్ తేజావత్ వెంకన్న, ఏఎంసీ సుభాష్, రెవెన్యూ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.