మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ ఉత్సాహంగా కొనసాగుతుంది. స్థానిక వార్డు మెంబర్ వరలక్ష్మీ ఆద్వర్యంలో గత మూడు రోజులుగా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. కాగా ప్రభుత్వం అందజేసిన పండుగ చీరలను కట్టుకుని, బతుకమ్మలు ఆడుతూ న్యూ కాలనీ మహిళలు సంబురపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఆడపడుచులకు తగిన గుర్తింపు లభిస్తుందని, కేసీఆర్, కేటీఆర్‌లకు తమ ఆశీస్సులు ఎల్లప్పుడు తోడుంటాయని అన్నారు.