హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని గంగారం కమ్యూనిటీ హాల్‌లో సోమవారం స్థానిక ఏరియా కమిటీ సభ్యుడు రవికుమార్, డివిజన్ తెరాస ఎస్సీ సెల్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, నాయకులు ప్రవీణ్ కుమార్, దొంత గోపి ముదిరాజ్, దయానంద్‌లు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న రేషన్ షాప్ నం.155లో గత 3 రోజుల నుంచి లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. అర్హులైన మహిళలు ఆధార్ కార్డుతో వచ్చి చీరలను తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.