కొండాపూర్‌లో ధ‌ర‌ణీ వివ‌రాలు సేక‌రించిన‌ బ‌ల్దియా క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌

ధ‌ర‌ణీ స‌ర్వే చేస్తున్న సిబ్బందితో మాట్లడుతున్న జీహెచ్ఎంసీ చీఫ్ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, జ‌డ్సీ ర‌వికిర‌ణ్‌, డీసీ వెంక‌న్న‌లు

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజ‌న్ లో జీహెచ్ఎంసీ చీఫ్ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ ప‌ర్య‌టించారు. ధ‌ర‌ణీ స‌ర్వే తీరును ప‌రిశీలించిన లోకేష్ కుమార్ స్వ‌యంగా ప‌లువురు నివాసితుల వివ‌రాల‌ను ధ‌ర‌ణీ ఆన్‌లైన్‌లో పొందుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ధ‌ర‌ణి స‌ర్వే విష‌యంలో అపోహ‌లు వ‌ద్దని, సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ధ‌ర‌ణి స‌ర్వే నిర్వ‌హించే సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అంద‌జేశారు. ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌ధానంగా ఏ అంశాల‌పై ప్రజ‌ల్లో ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌నే విష‌యాన్ని ఆరాతీశారు. లోకేష్ కుమార్ వెంట శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌, ఉప‌క‌మిష‌న‌ర్ తేజావ‌త్ వెంక‌న్న‌, ఏఎంసీ సుభాష్, రెవెన్యూ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

కొండాపూర్ లోని ఒక నివాసంలో స్వ‌యంగా ధ‌ర‌ణి వివ‌రాలు ఆన్‌లైన్‌లో పొందుప‌రుస్తున్న బ‌ల్దియా చీఫ్ క‌మిష‌న‌ర్ లోకేష్‌కుమార్ ప‌క్క‌న జ‌డ్సీ ర‌వికిర‌ణ్‌, డీసీ వెంక‌న్న‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here