నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సత్యలక్ష్మి నగర్ కాలనీ, మియాపూర్ విలేజ్ లో స్థానిక నాయకులు, కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎంటమాలజీ, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగింపజేసి, డ్రైనేజీ, మురికి కాలువలను శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవికృష్ణ, మారుతి, ఎస్ ఆర్ పి కనకరాజు, వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రమేష్, లింగయ్య, ఎస్ ఎఫ్ ఏలు, జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.