నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ దీప్తి శ్రీ నగర్, ఇంద్రానగర్ తదితర కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. కాలనీలలోని మురికి కాలువలతో పాటు రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శానిటేషన్ సిబ్బందితో తొలగింపజేశారు. నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందరి సహకారంతో పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ఏఈ రమేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ సునిత, శానిటేషన్ విభాగం అధికారులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.