58 జీఓతో పేదలకు శాశ్వత నివాసం – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేద, మద్య తరగతి ప్రజలకు శాశ్వత నివాసం ఏర్పరచుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల క్రమబద్ధీకరణ జీఓలను తీసుకువచ్చిందని జరిగిందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు.‌ చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీలో ఇళ్ల క్రమబద్దీకరణ కోసం 58 జీఓ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల ఇళ్లను రెవెన్యూ అధికారులు సర్వే చేసి పరిశీలించారు.

ఇళ్ల‌ క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న పేదల ఇళ్లను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా క్రమబద్ధీకరణ పథకం తీసుకురావడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి పేదలకు 58 జీఓ కింద క్రమబద్ధీకరణ చేయాలని అధికారులను సుచించారు. సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వారికి నివాస ధృవీకరణ పత్రాలు లేవని అలాంటి వారికి లబ్ధి చేకూర్చేలా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here