నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, గోపన్ పల్లి తండా లో ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంచి నీటి సరఫరా, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరు సరిగా లేదని వాపోయారు. సంబంధిత అధికారులతో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, ఎన్టీఆర్ నగర్ కోశాధికారి వేణు గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు మన్నే సురేష్ రాంచందర్, రవి, మఖ్బూల్ ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.