నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న కాలనీ మాజీ జనరల్ సెక్రటరీ నీలకంఠ రెడ్డి ని చందానగర్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవతా రెడ్డి పరామర్శించారు. నీలకంఠ రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు బాత్ రూమ్ లో పడిపోయి గాయపడ్డారనే విషయం తెలుసుకున్న నవతా రెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు.