పోచమ్మ ఆలయ నిర్మాణానికి గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి రూ. లక్ష విరాళం

నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని గచ్చిబౌలి డివిజన్ ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని రాయదుర్గం బుడగ జంగం బస్తీలో చేపట్టిన పోచమ్మ గుడి నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ‌ కమిటీ అధ్యక్షుడు సదుల శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం నిర్మాణంలో‌ భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, పోచమ్మ గుడి అధ్యక్షులు సదుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి సదుల శివ, పోచమ్మ ఆలయం కమిటీ సభ్యులు సదుల నర్సింగ్ రావు, సదుల అశోక్, సదుల లక్ష్మయ్య, సదుల నర్సింహా, బాబు రావు, సదుల గణేష్ యూత్ ప్రెసిడెంట్ సదుల గణేష్, సదుల సాయి కుమార్, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, సంజీవ్, శ్యామ్ యాదవ్, దుర్గారామ్, తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళంగా అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here