నమస్తే శేరిలింగంపల్లి: విద్యా వ్యవస్థలో ఉత్తమ సేవలందిస్తున్న త్రివేణి స్కూల్స్ ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతి లో ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ విద్యా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పురస్కార మహోత్సవాలలో త్రివేణి స్కూల్స్ కి విద్యా పరంపరలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు త్రివేణి సంస్థల తరపున అకాడమిక్ కో ఆర్డినేటర్లు మురళి, నటరాజ్ లు క్రీడా యువజన శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పలు మార్పులు తెస్తూ ఉత్తమ విద్యనందిస్తున్న త్రివేణి స్కూల్స్ యాజమాన్యాన్ని, పాఠశాలల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, స్థపతి అనందాచార్యులు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ,గిన్నిస్ రికార్డ్ గ్రహీత వెంపటి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.