నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్యసమరయోధునిగా, సంఘ సంస్కర్తగా దేశానికి అత్యున్నత సేవలందించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ను దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేరని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. భారత మాజీ ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలను మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో రాయదుర్గంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ హల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జగ్జీవన్ రామ్ పాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అంజమ్మ, నరేష్, శంకరి రాజు ముదిరాజ్, నాగపురి అశోక్ యాదవ్, సంపత్ కుమార్, సుధీర్, సత్యనారాయణ, బిక్షపతి యాదవ్, లియాకత్ అలీ, సల్లావుద్దీన్, ఆర్. శ్రీకాంత్, నందిరాజు, బ్రహ్మయ్య, విజయలక్ష్మి, అరుణ, బాలమణి, సుగుణ, లక్ష్మి, రాయదుర్గం బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు సురేష్, పాండు, చిత్తారి, సంజీవ, నరసింహ రాజు, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, పార్టీ శ్రేణులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.