చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ బస్తీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వేమన వీకర్ సెక్షన్ లో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం అని తెలిపారు. సీసీ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని, 15 రోజుల్లో పనులు మొదలుపెడతామని, మిగిలిన డ్రైనేజీ సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తాం అని అన్నారు. ఆమె వెంట రమేష్, మల్లేష్, మౌలాలి, జ్యోతి, సునీత, మీనా తదితర బస్తీవాసులు ఉన్నారు.