ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస అభ్య‌ర్థిని గెలిపించాలి

  • కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శంకర్ నగర్ కాలనీవాసులు పూర్తిచేసిన ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఓటర్ నమోదు అప్లికేషన్ లను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

ప‌ట్ట‌భ‌ద్ర ఓట‌రు న‌మోదు ఫాంల‌ను కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డికి అంద‌జేస్తున్న శంకర్ నగర్ కాలనీవాసులు

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సభ్యులు పనిచేయాలని, తెరాస‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలని అన్నారు. 2017 సంవత్సరం నాటికి డిగ్రీ ( అందుకు స‌మాన‌మైన డిప్లమా) పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫాం 18)తోపాటు ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు, రామా రావు, బాస్వేశ్వర్ రావు, కృష్ణమూర్తి, మనయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here