ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో అధికారులు అర్బన్ ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం నిర్వహిస్తుంచారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. పోర్టల్ లో నమోదు వివరాలు, ఏ ఆస్తులు, యజమానుల పేర్లు, వారసుల పేర్లు పొందుపరుస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ నమోదుకు అందరు సహకరించాలని కాలనీ వాసులకు సూచించారు. ధరణి పోర్టల్ లో ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పారదర్శకత ఉంటుందని ఆస్తుల తగాదాలు వంటివి చోటు చేసుకోవని. ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు.