ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక సమస్యలపై స్థానికులతో కలిసి బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ సమస్య గురించి ఆయనకు వివరించారు. కాలనీలో రోడ్డు నిర్మాణం పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
కాలనీలో పెండింగ్ పనులను నెల రోజుల లోపల పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇంకా అవసరమైన చోట రోడ్డు, డ్రైనేజీ విస్తరణ పనులు వెంటనే ప్రారంభించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కార్పొరేట్ అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, సీనియర్ నాయకుడు కిషన్, ఏరియా కమిటీ సభ్యులు వెంకటేష్, రాములు గౌడ్, నాయకులు సీహెచ్ భాస్కర్, యాదగిరి, వెంకట్ నాయక్, రెహమాన్, ప్రదీప్ రెడ్డి, అహ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.