చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శ్రీ సోమేశ్వరస్వామి ఆలయానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గురువారం పలువురిని కలిశారు. ఆలయ కమిటీ నూతన చైర్మన్ కావాలి చెన్నం రాజు ముదిరాజ్, డైరెక్టర్లు వసంత్ కుమార్, ఆకుల యాదగిరి, నరేందర్ గౌడ్, రవీందర్, రమేష్, రాధ లు చందానగర్ సీఐ రవీందర్, ఎస్ఐ లు మహమ్మద్ పాషా, వెంకటేష్, అడ్వకేట్ నామాల అశోక్ లను మర్యాద పూర్వకంగా కలిశారు.