నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల భద్రతకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజు మహిళ దినోత్సవం వేడుకలను చందానగర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలో కేసీఆర్ పథకాలతో లబ్దిపొందిన లబ్దిదారులను స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నేరుగా కలిసి స్వీటు బాక్సులను అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం ప్రజా శ్రేయస్సుకు పాటు పడుతుందన్నారు మహిళ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని మహిళలు ఆకాంక్షిస్తున్నారని మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.