నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెండో రోజున మహిళా బందు కేసీఆర్ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఆసరా, వితంతు పెన్షన్, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళలకు బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం యాదవ్, చంద్రికప్రసాద్, రోజా, రాణి, సుప్రజా, లత, కల్పన, సునీత, లక్ష్మీ, వాణి, రష్మీ, రాజుగౌడ్, శివ, వెంకటేష్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.