నమస్తే శేరిలింగంపల్లి: ఆకృతి క్రియేషన్స్, ఎస్ కె పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దళారి చలనచిత్రం షూటింగ్ సన్నివేశాలు లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో జరిగాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ షూటింగ్ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటులు షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్న దళారి చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుండడం అభినందనీయమని అన్నారు. చిత్రం విజయవంతం కావాలని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దళారి’ సినిమాను వేగవంతంగా పూర్తి చేసుకున్నామని అన్నారు. చిత్ర నిర్మాణానికి సహకరించిన నిర్మాతలు వెంకట్ రెడ్డి, సురేష్ కొండేటి కి, నటీనటులు శంకర్, శ్రీ తేజ్ , టెక్నిషియన్స్, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.