మియాపూర్: ఎంసిపిఐ(యూ)రాష్ట్ర కమిటీ సభ్యులు,కామారెడ్డి జిల్లా కార్యదర్శి,ఎఐటియుసి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ తేలు రాజలింగం మృతికి ఎంసిపిఐయూ నాయకులు నివాళులర్పించారు. మంగళవారం మియాపూర్ ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో రాజలింగం సంతాప సభను నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ రాజలింగం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ…కామ్రేడ్ తేలు రాజలింగం మరణం వామపక్షాల ఐక్యత కు, బహుజనుల సమీకరణకు తీరనిలోటని వ్యక్తపరిచారు. ఆయన కార్మిక వర్గ దృక్పథంతో పని చేస్తూ అనేక కార్మిక సంఘాలను నిర్మాణం గావించి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారని తెలిపారు. అలాగే ఎంసిపిఐయూ బలపరుస్తున్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను జిల్లావ్యాప్తంగా విస్తృత పరచడానికి ఆయన చేసిన కృషి అమోఘం మైనదని తెలిపారు. రాజలింగం అనునిత్యం ప్రజలమధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేశారని,ఆయన త్యాగం వృధా కాదని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం AIFDYరాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ రాజలింగం దోపిడి పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడమే కాకుండా MCPI (U) నిర్మాణాన్ని పార్టీ ప్రజా సంఘాలను నిర్మాణ హితంగా నడిపిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద విధానాలపై అలాగే రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజలింగం ఆశయ స్ఫూర్తితో పోరాడాలని కోరినారు. నూటికి 93 శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ప్రజల రాజ్యాధికార స్థాపన కై తను నిర్వహించిన అనేక కార్యక్రమాలు నేటి యువతరానికి ఆదర్శ ప్రాయమని రాజలింగం బాటలో పయనించి సమాజ మార్పు కై ప్రతి ఒక్కరం పనిచేయాలని తెలియజేస్తూ రాజలింగం కు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలోAIFDW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య,UPNMరాష్ట్ర అధ్యక్షులు మైదం శెట్టి రమేష్,AIFDS రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి,AIFDW గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఏ పుష్ప,గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు భాగ్యమ్మ,AIFDY నాయకులు మధుసూదన్ తదితరులు మాట్లాడారు. ఇంకా విమల, సుల్తానా బేగం,లలిత, రంగస్వామి,ఎల్ రాజు, రాములు,రాజేష్,దస్తప్పా తదితరులు పాల్గొన్నారు.