ఖానామెట్ లో అస్సాం యువకుడి దారుణ హత్య

నమస్తే శేరిలింగంపల్లి: ఉపాది కోసం నగరానికి వలస వచ్చిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రం నందగ్రామ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ముక్తాదిర్ మజూమ్దార్(22) నగరానికి వలస వచ్చాడు. ఖానామెట్ ముస్లిం బస్తీలో మరో తొమ్మిది మందితో కలిసి నివాసముంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సోమవారం తుమ్మిడికుంట సమీపంలోని పొదలలో అబ్దుల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అబ్దుల్ తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇతనితో పాటు ఉంటున్న యువకులను విచారించగా ఆదివారం నుండి అబ్దుల్ కనిపించలేదని వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన స్థలంలో అబ్దుల్ మృతదేహం

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here