నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ నుంచి ఉప్పల ఏకాంత్ గౌడ్, చౌదరి ధర్మారావు శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులతో కలిసి బూత్ నంబర్ 24 కొత్తపల్లిలో ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలను, కుతంత్రలను ప్రజలకు వివరించినట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరి నోటా ఈటెల రాజేందర్ మాటనే అని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజేందర్ గెలుపుతో తెలంగాణలో మార్పు రానుందని చెప్పారు. ఈటెల రాజేందర్ గెలుపును ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆపలేరని అన్నారు.