నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి మండల విద్యాధికారి పూర్తి స్థాయి నియామకం చేపట్టాలని బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ నాయకులతో కలిసి రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నందు సుకేంషి కి వినతి పత్రం అందజేశారు. శేరిలింగంపల్లి మండల విద్యాధికారి ఫోస్టును మూడేళ్ల నుంచి పక్క మండలానికి చెందిన అధికారితో ఇంచార్జీ ఎంఈఓగా నెట్టుకొస్తున్నారని బీజేవైఎం నాయకులు తెలిపారు. కరోనా వల్ల విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మండల పరిధిలోని ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలో ఆన్ లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అదుపుచేసే అధికారి లేరన్నారు. జీఓ.46 ను అమలు చేయాలని ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించేలా జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి స్థాయిలో శేరిలింగంపల్లి మండల ఎంఈఓను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైయం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బీజేవైయం నాయకులు శివ గౌడ్, బీజేవైయం డివిజన్ అధ్యక్షులు సిద్దూ, శివకుమార్, మధుసూదన్ రావు, బీజేవైయం డివిజన్ నాయకులు శివశంకర్ గౌడ్, వెంకట్ పాల్గొన్నారు.