నమస్తే శేరిలింగంపల్లి: మంగళవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరఘునాథ్ రెడ్డి తో పాటు ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి గంగారాం,పటేల్ చెరువు సుందరీకరణ పనుల అభివృద్ధి, వాటి పురోగతి పై ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.31 కోట్ల 26 లక్షల నిధులతో పటేల్ చెరువు,గంగారాం పెద్దచెరువు సుంధరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షకాలం దృష్ట్యా మురికి నీరు చెరువులో కలవకుండా నిర్మిస్తున్న యూజీడీ పైప్ లైన్, మ్యాన్ హోల్ నిర్మాణ పనులతో పాటు అసంపూర్తిగా మిగిలిన పనులను వేగవంతం చేయాలన్నారు.అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నెలలోపు అన్ని పనులు పూర్తి చేసి చెరువులు వర్షాలతో నిండు కుండలా మారి పూర్వవైభవం జల కళతో ఉట్టిపడేలా చేయాలని గాంధీ గారు అధికారులకు సూచించారు. చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు పై అధికారులకు పలు సూచనలు చేసి చెరువులను సంరక్షించుకోవాలని అన్నారు. వాకింగ్ ట్రాక్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.చెరువులు కబ్జా కాకుండా పూర్తి స్థాయిలో పెన్సింగ్ వేసి కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఈ నారాయణ, డీఈ పవన్ కుమార్, ఏఈ శేషగిరి రావు, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని,ఏఈ ధీరజ్,చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్,టీపీఎస్ తుల్జా సింగ్, రెవెన్యూశాఖ అధికారులు ఆర్ ఐ చంద్రారెడ్డి,సర్వేయర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.