నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి శ్రీదేవి థియేటర్ నుంచి బంధం కొమ్ము వరకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కరించారు. రోడ్డు పక్కన ఉన్న చెత్తా చెదారాన్ని, వ్యర్థాలను శానిటేషన్ సిబ్బందితో తొలగింపజేశారు. పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘునాథరెడ్డి, జలమండలి ఏరియా మేనేజర్ సునిత, ఎస్ఆర్‌పీ బాలాజి, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్, శివ, నాయకులు గురుచరణ్ దుబే, జనార్ధన్ రెడ్డి, ఓ.వేంకటేష్, అక్బర్ ఖాన్, దాసు, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీకాంత్, యశ్వంత్, మిరియాల ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.